టీటీడీ బోర్డులో బీజేపీ నేత భానుప్రకాష్‌‌రెడ్డికి చోటు

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డికి చోటు లభించింది. ఇప్పటికే 24 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేయగా.. తాజాగా మరొకరికి చోటు కల్పించారు. 

చైర్మన్ తో పాటు 25 మంది, టీటీడీ ఈవో, తుడ చైర్మన్, దేవాదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్ మొత్తం 29 మందితో బోర్డు ఏర్పాటు చేస్తూ ఏపీ దేవాదాయ శాఖ సెక్రటరీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో కొత్త టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు.