బీహార్ లో 14 నుంచి అన్ లాక్ ప్రక్రియ

బీహార్ లో 14 నుంచి అన్ లాక్ ప్రక్రియ
  • సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు

పాట్నా: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో బీహార్ రాష్ట్రంలో అన్ లాక్ ప్ర్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 14 నుంచి సడలింపులు మరికాస్త పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. అన్ లాక్ ప్రక్రియను దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. 
లాక్ డౌన్.. కర్ఫ్యూ సడలింపుల్లో బాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలయాల్లో 50 శాతం సిబ్బందితో సాయంత్రం 4 వరకు పనిచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే నిత్యావసరాల కోసం దుకాణాలను సాయంత్రం 5 గంటల వరకు తెరచుకునేందుకు అనుమతిచ్చారు. అటు తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అదనపు సమయం ఇచ్చారు. రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ యధాతథంగా అమలులలో ఉంటుంది. కరోనా కేసుల నేపధ్యంలో స్కూల్లు, కాలేజీలపై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మూసివేత కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.