రామ జన్మభూమి ఆయోధ్యలో ఓ ఉపాధ్యాయుడు అతి దారుణంగా..నీచాతి నీచంగా వ్యవహరించాడు. తన బిడ్డలాంటి ఓ స్టూడెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ బాలిక ప్రైవేటు పార్ట్స్ ను తాకి..రాక్షసానందం పొందాడు కీచకుడు. చివరకు విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ ఆయోధ్యలోని బాబా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుదౌలీ తహసీల్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో సెప్టెంబర్ 16వ తేదీన ప్రిన్సిపాల్ రిజ్వాన్ అహ్మద్ ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్కూల్ అయిపోయాక..ఇంటికి వెళ్తున్న ఓ బాలికను ప్రిన్సిపాల్ రిజ్వాన్ అహ్మద్ ఆపాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ స్కూల్ నుంచి బయటకు వెళ్లగానే..ఆ బాలికను బలవంతంగా తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి లోపల నుంచి తాళం వేశాడు. ఆ తర్వాత బలవంతంగా బట్టలు తొలగించి ఆమె ప్రైవేటు పార్ట్స్ ను తాకాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాక బాలిక మళ్లీ స్కూల్ కు వెళ్లలేదు. అయితే మొదట్లో తల్లిదండ్రులు బాలిక అస్వస్థతకు గురై స్కూల్ కు వెళ్లడం లేదని భావించారు. రోజులు గడుస్తున్నా బాలిక స్కూల్ కు వెళ్లకపోవడంతో..పాఠశాలకు వెళ్లాల్సిందిగా తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. అనంతరం బాధితురాలిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు..ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేశారు.
Also Read :- 14 ఏళ్ల బాలికపై ఆరుగురు అత్యాచారం
#अयोध्या : थाना बाबा बाजार के एक प्राथमिक विद्यालय की घटना का वीडिओ आया सामने, शिक्षक ने शिक्षा जगत को किया शर्मशार, नाबालिक छात्रा के कपड़े उतार कर प्राइवेट पार्ट को किया था चेक, चेक करते वक़्त शिक्षक ने छात्रा संग की गंदी हरकत, पिता की शिकायत पर पुलिस ने शिक्षक को गिरफ्तार कर… pic.twitter.com/qyZXQszjn5
— Nedrick News (@nedricknews) September 30, 2023
బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రిన్సిపాల్ రిజ్వాన్ అహ్మద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓ వీడియో వైరల్ అయింది.
