వింటేజ్ లుక్ తో  ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 

వింటేజ్ లుక్ తో  ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 

అటు మొబైల్ సంస్థ లాంచ్ చేసిన ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ కు మంచి ఆదరణ కనబడుతోంది. హైదరాబాద్ గోల్ప్ క్లబ్ లో ఆటమ్ బైక్ ను డిస్ ప్లే ఉంచారు. HGAలో ఎక్స్ కెప్టెన్స్ మీట్ పేరుతో నిర్వహించిన ఇంటర్నల్ గోల్ఫ్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్లేయర్స్ ఈ బైక్ ను టెస్ట్ డ్రైవ్ చేశారు. వింటేజ్ లుక్ తో మార్కెట్లో కి లాంచ్ అయిన ఈ బైక్ చాలా బాగుందన్నారు ప్లేయర్స్. అన్ని వయసులవాళ్లు ఈజీగా డ్రైవ్ చేసేలా బైక్ తీసుకొచ్చిన అటు మొబైల్ సంస్థ పత్రినిధుల్ని ప్లేయర్స్ అభినందించారు. ఈ టోర్నిలో వందమందికి పైగా ప్లేయర్లు పాల్గొన్నారు.