Success: ఎక్సర్​సైజ్ ఆస్ట్రాహింద్​ మూడో ఎడిషన్​

ఇండియన్ ఆర్మీ, ఆస్ట్రేలియన్ ఆర్మీల సంయుక్త సైనిక విన్యాసాలు ఆస్ట్రాహింద్​ – 2024 మూడో ఎడిషన్​ మహారాష్ట్రలో నవంబర్ 8 నుంచి 21 వరకు జరగుతున్నాయి. ఈ విన్యాసాలను ఇరు దేశాలు ప్రతి ఏటా ఒక దాని తర్వాత మరొకటి నిర్వహిస్తాయి. 

ప్రాతినిధ్యం వహిస్తున్న బృందాలు 

140 మంది సిబ్బందితో కూడిన భారత బృందం ప్రధానంగా డోగ్రా రెజిమెంట్​కు చెందిన బెటాలియన్​, భారత వైమానిక దళానికి చెందిన 14 మంది సిబ్బంది భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 10వ బ్రిగేడ్​లోని రెండో డివిజన్​ 13వ లైట్​ హార్స్ రెజిమెంట్​ నుంచి 120 మంది ఆస్ట్రేలియన్ ఆర్మీ బృందం ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఐక్యరాజ్య సమితి చార్టర్​లోని చాప్టర్ 7 అనుసరించి ఇరు దేశాలతో శాంతిని నెలకొల్పేందుకు సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు. 

ప్రధాన లక్ష్యం

భారత్​, ఆస్ట్రేలియాల మధ్య సైనిక సత్సంబంధాలను బలోపేతం చేయడం, ఇరుదేశాలకు చెందిన సాయుధ దళాల సామర్థ్యాలను సమర్థంగా వినియోగించేందుకు సన్నద్ధం కావడం.  ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే, ఇరుదేశాలు సాంకేతిక పద్ధతులు, విధానాలు జాయింట్​ ఎక్సర్​సైజ్​ ద్వారా ఎక్స్​ఛేంజ్ చేసుకుంటాయి.  ఈ విన్యాసాలు కంబాట్​ కండిషనింగ్​, టాక్టికల్​ ట్రైనింగ్, వాలిడేషన్​ దశల్లో జరుగుతాయి. రెండో ఎడిషన్ విన్యాసాలు ఆస్ట్రేలియాలో జరిగాయి.