పురంద్రీశ్వరి మరిది కోసం ఆరాటపడుతున్నారు: మంత్రి అంబటి

చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.  చంద్రబాబు చట్టంలో ఉన్న లొసుగులను వెతుకుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కూడా మరిది బాగు కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచిన మరిది జైల్లో ఉంటే ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ జరపాలని పురంద్రేశ్వరి కోరుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ పీకే కాదని, కేకే అని కిరాయి కోటిగాడని సెటైర్ వేశారు చంద్రబాబు పార్టీని కాపాడదామనే తప్ప పరాయి కోటిగాడికి మరో పనిలేదన్నారు. ఆయన చేసే ప్రయత్నం వల్ల టీడీపీ మరింత బలహీనంగా మారిందన్నారు.

 17ఎను అడ్డంపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే దొంగ చంద్రబాబు అని ఆయన అన్నారు. దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందన్న అంబటి రాంబాబు బాబు తరుపున వాదనలు టెక్నికల్ గానే తప్ప అవినీతి చేయలేదని చెప్పడం లేదని ఎద్దేవా చేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు. అలైన్ మెంట్ మార్చి భారీ దోపిడీకి తెరతీశారన్నారు. దీని వల్ల ఎవరు లాభపడ్డారని అంబటి ప్రశ్నించారు. తాము ఎటువంటి స్కామ్ చేయలేదని చెప్పలేకపోతున్నారన్నారు. చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారననారు. అన్నీ ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందని అంబటి అభిప్రాయపడ్డారు. గతంలో అనేక కేసుల విచారణ నుంచి తప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం అడ్డంగా దొరికిపోయారన్నారు.

ALSO READ : హీరో వైఫ్​ని ఇన్సల్ట్​ చేసిన డైరెక్టర్​!