జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.  వార్షిక అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించి  ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులకు చెందిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకు ముందు ఏడాది ఉగ్రదాడి హెచ్చరికల కారణంగా అర్థాంతరంగా యాత్రను నిలిపివేశారు అమర్‌నాథ్‌ దేవస్థానం అధికారులు .

కశ్మీర్ లోని హిమాలయాల్లో  ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగనుంది.