దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఏపీ విషయానిరకి వస్తే ఎన్నికలు నాల్గో విడతలో 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది.
- ఏపీలో మొత్తం 4 కోట్ల 8 లక్షల ఓటర్లు
- 175 నియోజకవర్గాల్లో రిజర్వ్‌డ్ స్థానాలు: లోక్‌సభ(4 ఎస్సీ, ఒక ఎస్టీ), అసెంబ్లీ(29 ఎస్సీ, 7 ఎస్టీ)
- పురుష ఓటర్లు: 2 కోట్లకుపైగా
- మహిళా ఓటర్లు: 2.07 కోట్లకుపైగా
- థర్డ్ జెండర్: 3,482
- సర్వీస్ ఓటర్లు: 67,434
- NRI: 7,603
- మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు:178
- యువతతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు: 50
- 555 ఆదర్శ పోలింగ్ స్టేషన్లు
ఎన్నికల షెడ్యూల్
-
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
- ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
- ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
కాగా, 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 151 స్థానాలో వైసీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.