పచ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం (డిసెంబర్ 15న) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు ఆశా వర్కర్స్ యూనియన్ కు మద్దతు ఇచ్చేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఆకివీడు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చనిపోయారు.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డెడ్ బాడీని భీమవరం హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్.. భీమవరం హాస్పిటల్ కు చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గం యూటీఎఫ్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందిన విషయం తెలిసిందే.