అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ

అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో సమాజ్‌‌ వాదీ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇండ్లకు 300 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని ప్రకటించింది. అలాగే వ్యవసాయానికి కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పింది. ఈమేరకు లక్నోలో శనివారం జరిగిన పబ్లిక్ మీటింగ్‌‌లో సమాజ్‌‌ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌‌ హామీలు ఇచ్చారు. కాగా, అఖిలేశ్‌‌ ఇచ్చిన ఉచిత హామీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చారు. గతంలో సమాజ్‌‌ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇవ్వలేకపోయిందని, ఇప్పుడు ఫ్రీగా ఎలా ఇస్తుందో చెప్పాలని సీఎం యోగి నిలదీశారు.