భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా ప్రకటించారు. దసరా సందర్భంగా ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. "అజయ్ జడేజా నవనగర్‌కు కొత్త జామ్ సాహెబ్ కావడం సంతోషంగా ఉంది. ఇది జామ్‌నగర్ ప్రజలకు ఒక వరం అని భావిస్తున్నాను" అని జామ్ సాహెబ్ అన్నారు.
క్రికెట్‌తో ఈ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రాయల్ ఫ్యామిలీకి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం చేయడం జరిగింది. ఒకప్పటి ప్రిన్స్‌లీ స్టేట్ నవానగర్‌నే ప్రస్తుతం జామ్‌నగర్‌గా పిలుస్తున్నారు. దేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతోంది.
ALSO READ : Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. భారత జట్టు కెప్టెన్‌గా ఉతప్ప
అజయ్ జడేజా భారత క్రికెట్ జట్టులో గొప్ప ఆల్ రౌండర్ గా పేరుంది. 1992 నుండి 2000 వరకు టీమిండియా తరపున ఆడాడు. ఈ క్రమంలో భారత జట్టుకు వైస్ కెప్టెన్సీ సేవలందించాడు. అతని క్రికెట్ కెరీర్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడంతో అతనిపై నిషేధం విధించారు. 2003లో ఢిల్లీ హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ జడేజా ఆ తర్వాత క్రికెట్ ఆడలేదు. 53 ఏళ్ల జడేజా తన కెరీర్‌లో భారత్ తరపున 196 వన్డే మ్యాచ్ లాడాడు. 37.47 యావరేజ్ తో 5359 పరుగులు చేశాడు.ఇందులో ఆరు సెంచరీలతో పాటు 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
? JAMSAHEB AJAY JADEJA...!!! ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2024
- Ajay Jadeja has been announced as the next Jamsaheb of Nawanagar. ?❤️ pic.twitter.com/8C9n696w9p