WTC 2023-25: సొంత‌గ‌డ్డ‌పై క్లీన్‌స్వీప్.. చేజారిన అగ్ర‌స్థానం

స్వదేశంలో రారాజులా బ్రతుకుతోన్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో భంగపాటు ఎదురైంది. బెంగ‌ళూరు, పూణే, ముంబై అంటూ వేదికలు మారినా ఫ‌లితం మాత్రం మార‌లేదు. ఆడిన మూడు టెస్టుల్లోనూ వరుసగా పరాజయం పాలైంది. ఫలితంగా 12 ఏళ్ల త‌ర్వాత సొంత‌గ‌డ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. ఈ ఓటములతో తలెత్తుకోలేక ఓవైపు ఏడుపు లెక్కిస్తుంటే.. మరోవైపు, టెస్టు చాంపియ‌న్‌షిప్ రూపంలో గట్టి దెబ్బ తగిలింది.

Also Read :- మూడో టెస్ట్లోనూ ఓడిపోయాం.. వీళ్ల వల్లే..!

3-0 తేడాతో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వరల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023-25) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో 62.50 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుండగా.. 58.33 పాయింట్లతో  టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇక 55.56 పాయింట్లతో శ్రీ‌లంక మూడు, 54.55 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. 

ఆసీస్‌పై గెలిస్తేనే ఆశలు

వారంరోజులు క్రితం వరకూ ఓడిన ప్రతిసారి.. ఒకటేగా.. రెండేగా అంటూ వెనకేసుకొచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0తో  ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశ‌లు వదులుకోవాల్సిందే.

WTC పాయింట్స్ టేబుల్ అప్‌డేట్

  • ఆస్ట్రేలియా: 62.50 పాయింట్లు
  • భారత్: 58.33 పాయింట్లు
  • శ్రీలంక: 55.56 పాయింట్లు
  • న్యూజిలాండ్: 54.55 పాయింట్లు
  • దక్షిణాఫ్రికా: 54.17 పాయింట్లు
  • ఇంగ్లండ్: 40.79 పాయింట్లు
  • పాకిస్తాన్: 33.33 పాయింట్లు
  • బంగ్లాదేశ్: 27.50 పాయింట్లు
  • వెస్టిండీస్: 18.52 పాయింట్లు