టీడీపీలో చేరిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ తెలుగు దేశం పార్టీలో చేరారు. మార్చి 29వ తేదీ శుక్రవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్.. నిఖిల్ కు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరుపున  నిఖిల్ మామ ఎం ఎం కొండయ్యకు చీరాల నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కింది.

ఎపీలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో నిఖిల్, టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మా ఫ్యామిలీకి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించినందుకు టీడీపీ నిఖిల్ కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే, తన మామ కొండయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక,  మే 13న ఎపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న సంగతి తెలిసిందే.