నటుడు ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

 నటుడు ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

తమిళ స్టార్ హీరోలు విదేశాల నుంచి కొనుగోలు చేసిన కార్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోర్టుకెక్కడంపై మద్రాస్ హైకోర్ట్ ఆగ్రహం చేసింది. ఇటీవల హీరో విజయ్ తాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ కారుకు టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అపుడు విజయ్ కి చివాట్లు పెట్టింది కోర్టు. కాగా హీరో ధనుష్  కూడా ఇప్పుడు అదే బాటలో పయణించాడు. కాగా మద్రాస్ హై కోర్టు ధనుష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
2015లో ధనుష్‌ అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారు కొనుగోలు చేశాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్‌ వేసిన పిటిషన్‌ను లేటెస్టుగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టానికి ఎవరూ అతీతులు కారని.. పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రెటీలకు ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని నిలదీసింది. కోర్టు తీర్పుపై స్పందించిన ధనుష్.. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న చెల్లిస్తానని తెలిపాడు.