కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేశ్​ తేజ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్​ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో 49 మంది విద్యార్థులు అత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

25 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేజీబీవీ స్టూడెంట్లు ఫెయిల్  అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సౌమ్య, సతీశ్, శివ, బోయపల్లి శివ, కార్తీక్, అక్షయ, శ్రావణి, నవతేజ, జయంత్, సాయి, శివ కుమార్, అంజి పాల్గొన్నారు.