- నలుగురు అక్కడికక్కడే మృతి..
- ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 20 మందికిపైగా ఉన్నట్లు సమాచారం
- ఛత్తీస్ ఘఢ్ దంతెవాడ జిల్లాలో ఘటన
ఛత్తీస్ ఘడ్: ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులో పడింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. దంతెవాడ జిల్లాలో జరిగిందీ విషాద ఘటన. ప్మాదంలో మరింత మంది గాయపడినట్లు తెలుస్తోంది.
సోమవారం దేశ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో కూడా వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ట్రాక్టర్ లో వెళ్లి తిరిగి ఇళ్లకు బయలుదేరి వస్తున్న ట్రాక్టర్ చెరువుగట్టుపై అదుపుతప్పి బోల్తా పడింది. చెరువులోకి దూసుకెళ్లడంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు కూడా గాయపడినట్లు సమాచారం. ట్రాక్టర్ లో పిల్లలు.. పెద్దలు ఇంటిల్లిపాదీ కలసి వస్తుండడంతో అందరూ కలసి 20 నుంచి 30 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే కూంబింగ్ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు సహాయక చర్యలు చేపట్టారు.
