ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిపోతున్నారు ప్రజలు. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది.ఇవాళ కూడా పోలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో 242 మంది విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. స్వదేశానికి చేరుకున్న విద్యార్థులకు ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.ఇండియన్ ఎంబసీ సకాలంలో స్పందించి తమను క్షేమంగా తీసుకువచ్చిందని చెబుతున్నారు విద్యార్థులు. ఇండియాకు సేఫ్ గా తీసుకుచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
Welcome back home ??!
— PIB India (@PIB_India) March 11, 2022
Union Minister @ianuragthakur receives students who returned from #Ukraine via #OperationGanga this morning. pic.twitter.com/G5A4y0dIdq
మరిన్ని వార్తల కోసం
