కార్గో నౌక మునిగి నలుగురు ఇండియన్స్ గల్లంతు

కార్గో నౌక మునిగి నలుగురు ఇండియన్స్ గల్లంతు
  • గ్రీస్​ తీరంలో ఘటన 

న్యూఢిల్లీ:  గ్రీస్ తీరంలో ఓ భారీ కార్గో నౌక మునిగిపోయింది. ఈదురు గాలుల కారణంగా నౌక మునిగిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్గో షిప్​లో 14 మంది ఉండగా, ఒకరిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఇండియన్స్​తో సహా 13 మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు. ప్రమాద సమయంలో షిప్​లో 8 మంది ఈజిప్షియన్స్, ఇద్దరు సిరియన్స్ నౌకలో ఉన్నారని మీడియా చెప్పింది.  

రాఫ్టర్ అనే కార్గో నౌక  ఈజిఫ్టు నుంచి ఇస్తాంబుల్​కు  6  వేల టన్నుల ఉప్పుతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కార్గో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఆదివారం ఉదయం 7 గంటలకు  సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సిబ్బంది సహాయం కావాలని అధికారులకు సిగ్నల్స్ పంపించారు. అయితే, కొద్ది సేపటికే నౌక మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. నౌకలోని వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా సెర్చ్ ఆపరేషన్ పనులకు ఆటంకం ఏర్పడుతున్నది.