గుంటూరులో రెడ్డి హాస్టల్ పై ఓ పార్టీ కుర్రోళ్ల దాడి

గుంటూరులో కొంతమంది దుండగులు బరి తెగించారు.  ఓ హాస్టల్​ వ్యాపారిని ..సాటి మనిషి అని కూడా కనికరం చూడకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు.  అంతేకాదు హాస్టల్​ యజమానిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించుచూ కర్కోటకంగా వ్యవహరించారు.  ఈఘటన గురించి పూర్తి  వివరాల్లోకి వెళ్తే  ...

గుంటూరు లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు.. కొంతమంది దుండగులు  హాస్టల్ యజమానిపై దాడి చేసి..   కాళ్ళు పట్టించుకున్న హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు లక్ష్మీపురంలో ఓ వ్యక్తి రెడ్డి​ అనే పేరుతో  హాస్టల్​ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.  అయితే కొంతమంది దుండగులు హాస్టల్​ యజమానిని దారుణంగా కొట్టి కాళ్లు పట్టించుకున్నారు.  హాస్టల్​ సామాగ్రిని చిందర వందర చేసి.. యజమానిని మోకాళ్లపై కూర్చోమని దుండగులు కాళ్లు పట్టించుకున్నారు. హాస్టల్లోని అద్దాలను, పూలకుండీలను  ధ్వంసంచేశారు.  దాడి చేసిన దుండగులు ఓ పార్టీకి చెందిన వారని సమాచారం అందుతోంది.