రైల్వే సిబ్బందికి విశిష్ట్ ​రైల్ ​సేవా అవార్డులు

పద్మారావునగర్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే 69వ వారోత్సవాలు శుక్రవారం సికింద్రాబాద్‌ న్యూబోయిగూడ రైల్ కళారంగ్ లో ఘనంగా జరిగాయి. జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని 36 మందికి జోనల్‌ ఎఫిషియెన్సీ షీల్డ్​లు, 75 మందికి విశిష్ట రైల్ సేవా పురస్కార్ అవార్డులు అందజేశారు. రైల్వే అడిషనల్​జీఎం నీరజ్ అగ్రవాల్, సీనియర్ డిప్యూటీ జీఎం జె.వినయన్, డిప్యూటీ జీఎం(జనరల్) ఉదయనాథ్ కోట్ల పాల్గొన్నారు.