కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
స్వామి వారి సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక SSD టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందన్నారు. ఈ క్రమంలోనే భక్తులు పిల్లలతో వచ్చిన వారు చాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వసతులు ఉన్నప్పటికి ఎక్కువ సేపు క్యూ లైన్ లో నిలబడే సరికి ఇబ్బందులకు గురవుతున్నారు.