IPL 2025: జాక్ పాట్ పక్కా: అయ్యర్‌, పంత్‌లపై మూడు ఫ్రాంచైజీలు కన్ను

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి టీమిండియా స్టార్ యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ రానున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టులో పంత్ లేడు. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ తమకు 2024 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ అందించిన శ్రేయాస్ అయ్యర్ ను వద్దనుకుంది. దీంతో ఈ సారి వేలంలో వీరిద్దరికీ భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్సీ వీరిద్దరికి అనుకూలంగా మారింది. దీంతో వీరిద్దరిపై ఏయే ఫ్రాంచైజీలు కన్నేశారో ఇప్పుడు చూద్దాం.      

శ్రేయాస్ అయ్యర్:
 
ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, పంజాబ్ జట్లకు సరైన కెప్టెన్ లేడు. ఫాఫ్ డుప్లెసిస్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంతో కెప్టెన్ కోసం  అయ్యర్ ను టార్గెట్ చేయొచ్చు. మరోవైపు ఢిల్లీ జట్టు పంత్ ను వదిలేసుకుంది. అతను తప్పుకోవడంతో అయ్యర్ ఢిల్లీ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. గతంలో అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో మరోసారి అతనికి ఆ అవకాశం దక్కొచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ కు సైతం సరైన కెప్టెన్ కోసం వెతుకుతుంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటచడంతో పంజాబ్ అతన్ని వేలంలో తీసుకునే అవకాశం లేకపోవడంతో అయ్యర్ పై గురి పెట్టొచ్చు.

Also Read :- కారణం లేకుండా పక్కన పెట్టారు

రిషబ్ పంత్: 

రిషబ్ పంత్ ఈ సారి చెన్నై జట్టుకు వెళ్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రైనా ఇటీవలే మాటలను చూస్తుంటే పంత్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోనున్నట్టు అర్ధమవుతుంది. నివేదికలు కూడా రిషబ్ పంత్ పై చెన్నై ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నాయి. ధోనీ తర్వాత చెన్నైకి సరైన వికెట్ కీపర్ లేడు. ఒకవేళ పంత్ ను తీసుకుంటే అతను వికెట్ కీపింగ్ తో కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ రూ. 110 కోట్లతో ఆక్షన్ లోకి దిగుతుంది. పంత్ కు రూ. 25 కోటలు ఇచ్చి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. బెంగళూరు జట్టు ఒకవేళ కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వకపోతే పంత్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.