పీవోకే లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి

పీవోకే లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి

పాక్ అక్రమిత కశ్మీర్‌ (POK)లో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి 22 మంది మృతిచెందగా, 8 మంది గాయపడ్డారు. POK‌లోని సుద్నోతి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని బలూచ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి‌కి బస్సు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో.. బస్సు మొదట రోడ్డుకు ఎడమవైపున ఉన్న కొండను ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే 500 అడుగుల లోయలో పడిపోయింది. 

బస్సు లోయలో పడిపోవడాన్ని చూసి రోడ్డు పక్కన షాపు నడుపుకునే వ్యక్తి... స్థానిక మసీదు పెద్దకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో మసీదు పెద్ద మైక్ ద్వారా సమాచారాన్ని గ్రామస్తులకు తెలియపరిచారు. గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రమాద స్థలానికి చేరుకోవాలని కోరారు. గాయపడిన వారిలో ఐదుగురిని కోట్లి జిల్లాకు, మరో ముగ్గురిని బెలోచ్ జిల్లాకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందినట్టుగా పూంచ్ డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ జనరల్ రషీద్ నయిమ్ తెలిపారు. 

అయితే POKలో  రహదారులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ ప్రయాణించాలంటే డ్రైవర్ల అప్రమత్తత చాలా అవసరం. అయితే రోడ్ల పరిస్థితి కూడా బాగాలేకోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.